మారుతున్న వాతావరణం బట్టి మరియు పోషకాహార లోపం వలన చాలామంది స్త్రీలలో పీరియడ్ సైకిల్ సరిగ్గా రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది చిన్నవారి నుంచే ఈ సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇది ఇలా రావడానికి హార్మోన్స్ లోపం లేదా నీటి బుడగల వలన కూడా జరుగుతుంది. ఇటువంటి ఇబ్బంది ఉన్నవారు ఏదైనా ఫంక్షన్ లేదా శుభకార్యాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. నెలసరి రావడానికి డాక్టర్లు చుట్టూ తిరుగుతూ ఎన్నో మందులు ఉపయోగిస్తున్నారు. మందులు మానేసిన వెంటనే మరలా తిరిగి సమస్య మొదలవుతుంది.
ఇలా నెలసరి రావాలి అంటే మన ఇంట్లో ఉపయోగించే పదార్థాలతోనె ఒక మంచి రెమెడీ తయారు చేసుకుందాం. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనకు ముందుగా సొంటిపొడి కావాలి. ఈ సొంటి పొడి బాలింతలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. రెండవదిగా జీలకర్ర ఇది మన రుతుక్రమాన్ని సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధ సమస్యల నుంచి కూడా విడుదల అందిస్తుంది మూడవదిగా వాము. వాము కూడా మన శరీరంలో జివక్రియలు సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.
నాలుగవదిగా పసుపు. పసుపు యాంటీబయోటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా రుతుక్రమాన్ని క్రమపరచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు రెమిడి తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇది మరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము, హాఫ్ స్పూన్ సొంటి పొడి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత రెండు గ్లాసుల నీటిని పోసుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అవసరమైతే రుచి కోసం బెల్లం ముక్క వేసుకోవచ్చు.
ఇలా పది నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆపి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్ లోనికి వడకట్టుకోవాలి. ఇలా తయారైన కషాయమును రాత్రి పడుకునే అరగంట ముందు కొంచెం కొంచెంగా తాగాలి. ఇలా ఒక్కసారి మాత్రమే తాగాలి. ఇది తీసుకున్న వెంటనే లేదా తర్వాతి రోజు నెలసరి లేదా పిరియడ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే రెండు రోజులు ఎదురు చూడాలి. కానీ మరలా ఈ డ్రింక్ ను సేవించకూడదు…..