ఒకప్పుడు యాభై ఏళ్ళకు వచ్చే కీళ్ళనొప్పులు ఇప్పుడు చిన్నవయసులోనే ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆడవిరిలౌ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీనికి ళకారణం కీళ్ళవాతం. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, భుజం నొప్పి, వెన్ను నొప్పి, చేతుల్లో నొప్పులు వస్తాయి. వీటి ప్రభావం వలన ఇబ్బంది పడుతుంటారు. ఎముకలు మధ్య ఉండే గుజ్జు లాంటి పదార్థం అరిగిపోవడం వలన ఎముకలు మధ్యలో నడుస్తుంటే శబ్దం రావడం,నొప్పితో పాటు వాపుకు కారణమవుతాయి. అధికబరువు వల్ల కానీ, వంశపారంపర్యంగా కానీ, యాక్సిడెంట్ లేదా వ్యాధినిరోధక శక్తి తగ్గడంవలన మన వంటిట్లో లభించే ఆవాలనూనెతో చేసే చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. మరింత సమాచారం కోసం క్రింద వీడియో చూడండి.
దీనికోసం అల్లం తీసుకుని చిన్నముక్కలుగా కట్ చేయాలి.ఒక స్పూన్ మెంతులు ,ఐదారు లవంగాలు, ఆరు వెల్లుల్లి రెబ్బలు,చిన్న దాల్చిన చెక్క, అరస్పూన్ వామును తీసుకోవాలి. ఇనుప మూకుడు తీసుకుని అందులో చిన్న టీ గ్లాసులో పావువంతు ఆవాలనూనె తీసుకుని వెల్లుల్లి రేఖలు వలిచి వేయాలి.అలాగే అల్లం ముక్కలు, మెంతులు, వాము, దాల్చిన చెక్క వేసుకోవాలి. లవంగాలు మాత్రం దంచి తర్వాత వేసుకోవాలి. లేకపోతే లవంగాలను అలాగే వేస్తే నూనెలో ఎగిరి పడతాయి. వేడినూనె మళ మీద పడే అవకాశం ఉంటుంది. ఈ పదార్థాలు అన్నీ తక్కువ మంటలో బాగా వేగేలా వేయించాలి. అందులో ఉండే పోషకాలను నూనె గ్రహిస్తుంది. అవి కొంచెం వేగిన తర్వాత లవంగాల పొడి వేసుకోవాలి.
బాగా కలుపుకుంటూ అవి ఇంకొంచెం వేగిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం వడకట్టుకోవాలి. ఈ పదార్థాలలో ఉండే వేడి చేసే గుణం వలన మసాజ్ చేసినప్పుడు కీళ్ళనొప్పులు ఉపశమనం పొందుతాయి. కావాలి అనుకుంటే ఇందులో ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఆవనూనె లేకపోతే నువ్వుల నూనె వాడవచ్చు. దీనిని ఎయిర్ టైట్ కంటెయినర్ లో నిల్వచేసుకొని నొప్పి ఉన్నచోట ఈ నూనెతో మసాజ్ చేసి వేడినీటిలో గుడ్డతో తుడిస్తే నొప్పులు తగ్గిపోతాయి. కీళ్ళలో ఉండే నరాలకు రక్తప్రసరణ సరిగ్గా అంది నొప్పులు తగ్గుతాయి. ఆయుర్వేదంలో చెప్పబడిన ఈ చిట్కా వలన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.