తిప్పతీగ గురించి ఐదు విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి అంటున్నారు. ఆయుర్వేద నిపుణులు. ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేటువంటి శక్తి ఉంది అంటున్నారు. అనేక రకాలైనటువంటి వ్యాధులు నయమవుతాయని ఇప్పుడు ఆనందయ్య గారు తయారుచేసిన మందులో కూడా వాడడంవలన రుజువయింది. ఇది తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో చూద్దాం.
దీని రసం తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచి గుణం అధికమవుతుంది. ఇది త్వరగా రక్తంలో కలిసిపోయి వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆయుర్వేద చికిత్సల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. స్వైన్ ఫ్లూ లాంటి జ్వరాలకు కూడా ఈ తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది. తిప్పతీగ మలేరియా జ్వరం మరియు అనేక రకాలు వ్యాధులను తగ్గిస్తుంది. బెల్లంతో కలిపి రసం తాగితే మలబద్ధకం తగ్గిపోతుందట. .పంచదారతో కలిపి సేవిస్తే శరీరంలో వేడి తగ్గుతుందట. తేనెతో కలిపి సేవిస్తే కఫం తగ్గుతుందట. ఆముదంతో కలిపి సేవిస్తే శరీరంలో వాతం తగ్గుతుంది. సొంటితో కలిపి సేవిస్తే ఆమ్లత్వం తగ్గుతుందట.
ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది.జీర్ణసంబంధ సమస్యలతో బాధపడేవారికి కూడా తిప్పతీగ మంచి మందు.జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ప్రత్యేకంగా హైపోగ్లైసేమిక్ నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 మధుమేహం తగ్గించడంలో తిప్పతీగ చాలా మంచి ఫలితం ఉంటుందట. చూడడానికి తిప్పతీగ తమలపాకు ఆకారంలో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇది శ్వాసకోశ వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.
ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్లకి కూడా దీని వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తాయి. ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. సీజనల్ వ్యాధులు, ఫ్లూలు రాకుండా కాపాడుతుంది. చెట్ల మీద అల్లుకుంటుంది. ఒకసారి మొలిచింది అంటే ఎన్నిసార్లు పీకినా కొన్ని నీళ్లు తగలగానే మళ్లీ మేలు చేస్తుంది. కొంచెం కారం, వగరు రుచులు కలిగి ఉండీ,నమిలినపుడు జిగురుగా అనిపిస్తూ ఉంటుంది.ఈ మొక్ఋను గర్బవతిగా ఉన్నప్పుడు, పిల్లలకు పాలిచ్చే తల్లులు,చిన్న పిల్లలు వాడకూడదు.