యూరిక్ యాసిడ్,గౌట్,కీళ్ల వాపులు సులభంగా ఇలా వాము సహాయంతో పూర్తిగా నయం చేసుకోండి | Uric Acid Tips

యూరిక్ యాసిడ్ శరీరంలో పెరిగిపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మనం భోజనం చేసినప్పుడు మన జీర్ణాశయం ఆహారం జీర్ణంచేసి పోషకాలను శరీరానికి అందిస్తుంది. యూరిక్ యాసిడ్ కూడా అలాంటి పోషకాలలో ఒకటి. అది మూత్రపిండాల్లోకి వెళ్ళి తర్వాత మూత్రం ద్వారా బయటకు వస్తుంది.

ఈ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోయి బయటకు వెళ్ళలేకపోతే ఇది శరీరమంతా వ్యాపిస్తుంది. అలా జరగడంవలన రకరకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది. చేతులు, కాళ్ళలోని ఎముకలలో వాపులు రావడం, కీళ్ళమధ్యలో తరుచూ వాపులు రావడం జరుగుతుంది.

ముఖ్యంగా వాపులు వచ్చిన ప్రదేశాలలో ఎర్రగా అవుతుంది. ఇలాంటి సమస్యలకు యూరిక్ యాసిడ్ ఫ్రధాన కారణం. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగితే డయాబెటిస్, కిడ్నీ సంబంధిత రోగాలు ఇలాంటి ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వలన కీళ్ళనొప్పులు తరుచు వస్తూ ఉంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఎముకల మధ్యలో స్పటికాలలా గట్టిగా ఏర్పడతాయి.

దీనివలన ఎముకలు స్వరూపం మారుతుంది. దీనిని గౌట్ అని పిలుస్తారు. ఉదయం లేదా సాయంత్రం పూట ఒంట్లో నొప్పులు వస్తే దీనికి గౌట్ కారణం కావచ్చు. యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు మనం తినకూడని ఆహార పదార్థాలు చూద్దాం. అందుకే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరగకుండా చూసుకోవచ్చు.

దానికోసం మీరు ఆనపకాయ(సొరకాయ), వాము(అజ్వైన్),  మిరియాలు తీసుకోవాలి. ముందుగా వామును మెత్తగా దంచి దానిని పొడి చేసుకోవాలి. సొరకాయ పైన చెక్కు తీసి ముక్కలుగా చేసి ఒక గ్లాసు జ్యూస్లా చేసుకోవాలి. ఒక చెంచా వాముపొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇందులో వేసుకోవాలి. ఉదయాన్నే ఏమైనా తిన్న తర్వాత ఈ జ్యూస్ తాగితే చాలు. ఈ జ్యూస్ ఆయుర్వేదం ప్రకారం యూరిక్ యాసిడ్ను శరీరం నుండి బయటకు పంపుతుంది.

యూరిక్ యాసిడ్ ఎక్కువయితే విషపదార్థాలతో సమానం. ఈ జ్యూస్ శరీరంలో పెరిగే వ్యర్థాలను డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మూత్రపిండాల్లో, కాలేయంలో ఏర్పడే విషవ్యర్థాలను బయటకు పంపడంలో ఈ రసం  ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనివలన ఎంత తీవ్రమైన యూరిక్ యాసిడ్ సమస్యైనా తగ్గిపోతుంది. వాముపొడి, మిరియాల పొడివలన ఈ మరింత ప్రభావవంతంగా  ఉంటుంది.

ఖాళీ కడుపున ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా నీరు తాగడం వలన కూడా మూత్రంద్వారా యాసిడ్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఆల్కహాల్, జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి. అలాగే టీ, కాఫీలు, మసాలాలు, కూరహల్ డ్రింక్స్ కూడా మానేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top