చమట, దద్దుర్లు, కారణంగా అండర్ వేర్ ధరించే ప్రాంతంలో చాలామందికి నల్లని వలయాలు ఏర్పడతాయి. ఈ నల్లని వలయాలను చిన్ని చిన్ని చిట్కాలతో తొలగించుకోవొచ్చు.
- కాటన్ అండర్ వేర్ చర్మానికి గాలిని అందిస్తుంది. దీనివల్ల నల్లని వలయాలు మరియు దద్దుర్లు రాకుండా ఉంటాయి.
- తాజా కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం,అన్ని రకముల ధాన్యపు గింజలు తినడం మంచిది.
- రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్ళు తాగడం వలన మీ శరీరం లోపలి భాగాలలో ఉండే విష కణాలు బయటకు రావడమే కాక, చర్మo ఆరోగ్యవంతంగా ఉంటుంది.
నల్లని వలయాలు రాకుండా ఈ నియమాలు పాటించండి
దుస్తులు
పాలియెస్టర్ దుస్తులు ధరించడం వలన చమట ఎక్కువగా పడుతుంది. దీని వలన అండర్ వేర్ ధరించే ప్రాంతంలోఎపిడేర్మిస్ (చర్మ పొర) దెబ్బతింటుంది. మీరు భారీ శరీరాన్ని కలిగి ఉంటే కాటన్ దుస్తులు వేసుకోడం మంచిది.
రోమాల తొలగించే రసాయనాలు
అండర్ వేర్ ధరించే ప్రదేశంలో క్రీములు వాడటం వలన శాశ్వతంగా నల్లని వలయాలు వస్తాయి. రసాయనాలు లేని వస్తువులే వాడండి.
ఆలివ్ ఆయిల్ వల్ల ఉపశమనం
ఆలివ్ ఆయిల్తోఆ ప్రదేశంలో మసాజ్ చేసి, రాత్రంతా ఉంచితే.. నల్లని వలయాలను తగ్గించుటకే కాకుండా చర్మాన్ని మృధువుగా, దద్దుర్లు రాకుండా చేస్తుంది.
పచ్చి పాలు
పచ్చి పాలు అధ్బుతంగా పనిచేస్తుంది. పచ్చి పాలను దూది తీసుకొని నల్లని వలయాలు ఉన్న చోట రాసుకోవాలి. ఇది సహజంగా చర్మాన్ని తెల్లగా చేయడంతో పాటు, నల్లని మచ్చలను నివారిస్తుంది.