అపారమైన ఔషధ గుణాలతో నిండి ఉన్న కలబంద (Aloe Vera )లో ఎ,బి,సి,డి,ఇ వంటి అత్యంత కీలకమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల ఒకటని చెప్పలేం. అందానికి,ఆరోగ్యానికి కలబంద ప్రధమ స్తానంలో ఉంటుంది.
- శరీరంలోని కొవ్వును,అలానే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించేందుకు కలబందలో ఉన్న లిపాసెస్ ఎంజైము పనిచేస్తుంది.
- ప్రొటెనెస్ అనే మరో ఎంజైము ప్రొటీన్లు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
- బ్రాడికీనెస్ అనే ఇంకొక ఎంజైము కడుపులోని మంటను అరికట్టడంతో పాటు చర్మాన్ని మృధువుగా మారుస్తుంది.
- కలబందలో జీర్ణశక్తికి కావలసిన లవణాలు, ఎలిమెంట్లు కూడా కావలసినంతగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ చక్కబడుతుంది. అలానే శరీరంలోని వ్యర్థ విషపదార్థాలు సక్రమంగా విసర్జించబడతాయి.
- కలబందలో ఉండే సలిసైలిక్ యాసిడ్ రక్తం పలుచగా ఉండేలా చేస్తుంది. ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఇంప్లిమెంటరీ. ఈ సలిసైలిక్ యాసిడ్ వలన చర్మ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
- కలబందలోని సపోనిన్స్ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్‌లను,నాశనం చేయడంలో కలబంద ఎంతగానో సహకరిస్తుంది.
- అధ్యయనాల ప్రకారం శరీరానికి కావలసిన 22 యాసిడ్స్‌లో 20 ఈ కలబందలోనే దొరుకుతాయట.దీని ద్వారా ఎసిడిటిసమస్యలు, దీర్ఘకాలిక మలబ్ధకం, కూడా సులువుగా తగ్గించుకోవచ్చు.
- కలబందలో 12 రకాల క్రిమినాసికాలు ఉన్నాయి. ఇవి గ్యాస్ట్రో సమస్యలు,అలానే కడుపులో నొప్పులను నివారిస్తుంది.
- లివర్ సమస్యలు, గాస్ , మధుమేహం, రక్తహీనత, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం, ఇలా అనేక సమస్యలకు కలబంద ఒక సరైన పరిష్కారం.