మనిషి తన సగం జీవితం నిద్రలోనే గడిపేస్తాడు.నిద్ర అనేది చాల ముఖ్యం. సరైన సమయానికి పడుకోడం, పొద్దున్నే లేవడం వంటివి అలవాటుగా చేసుకొంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు. అలసిపోయిన శరీరానికి నిద్ర మందులా పనిచేస్తుంది. నిద్ర అలసటని మాయం చేస్తూ.. కొత్త జీవనోత్సాహాన్ని నింపుతుంది. చదువుకొనే పిల్లల దగ్గర నుంచి, ముసలి వయసు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి సరైన నిద్ర ఎంతో అవసరం. కాని, నేటి తరం వారికి నిద్రలేమి అధికంగా ఉంది..కొంత మంది వర్క్ స్ట్రెస్ తో , మరికొందరు స్టడీ స్ట్రెస్ తో, ఇంకొందరు నైట్ ఆన్ లైన్ స్ట్రెస్ తో… నిద్ర లేక,కలత నిద్రతో బాధపడుతుంటారు. మనదేశంలోనే 30 శాతం పైన కలత నిద్ర బాధితులు.నిద్ర కోసం తపించి నిద్ర మందులకు బానిసలుగా మారారు.వీరిలో మహిళలలే అధికం.
ఇన్సోమ్నియా:
దీర్గనిద్ర లోపించడం, అసలు నిద్రే పట్టకపోవడం, బెడ్ మీద పడుకున్నారనే కాని,, అటు ఇటు దొర్లడం,ఎక్కువ సేపు పడుకున్నా లేవగానే బడలికగా అనిపించడం, దీని వల్ల రోజంతా మత్తుగా ఉండటం ఇలా సమస్యలు ఉన్నాయి.
నిద్రలేమి:
నిద్ర లేచాక కూడా బడలిక, అలిసనట్టు బావన, విసుగుగా ఉండటం,మూడీగా ఉండటం, నిద్రలో జోగుతున్నట్లు ఉండడం,నిద్రలేమికి నిదర్శనాలు. కేవలం జీవన విధానం వల్ల కలిగే సమస్యలు,ఒత్తిడి, వ్యాధినిరోధక వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
స్లీప్ యాప్నియా:
సడ్డెన్’గా ఊపిరి సరిగ్గా ఆడనట్టు అనిపించడం,శ్వాస కోసం తీవ్రంగా ప్రయత్నించడం, గురక పెట్టడం ఇవన్ని ఈ బాధకు లక్షణాలు.