నిమ్మజాతి పండ్లలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కవచం ఎలా రక్షణగా నిలుస్తుందో, నిమ్మపండు మనిషి శరీరంలో యుద్ధం చేసే ఇన్ఫెక్షన్’లతో పోరాడుతూ కవచంలా ఉంటుంది. ఈ కవచాన్ని కేవలం పండ్ల రూపంలో తింటే,చాలు. శరీరానికి గాయాలు తగిలితే, నిమ్మజాతి పండ్లని తింటే, త్వరగా గాయాలు తగ్గుతాయి.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైద్య బాషలో ఈ విటమిన్ ‘సి’ ని ‘యాస్కార్బిక్ యాసిడ్’ అని అంటారు. ఇది మనిషి శరీరానికి ఎంతో అవసరమైన పోషకం.
మానసిక వత్తిడులు, కాన్సర్ వంటి మహమ్మారి పెరుగుదలను తగ్గించడం , స్కర్వీ వంటి వ్యాధులకు సమర్ధంగా ఉపయోగపడుతుంది. నిమ్మజాతి పండ్లను ఎక్కువగా తీసుకొంటే, జలుబు చేస్తుందనే అపోహ ఉంది.. నిజానికి ఏ చికిత్సా తగ్గించలేని జలుబును విటమిన్ ‘సి’ నిండి ఉన్న ఈ పండ్లు తగ్గిస్తాయని తెలుస్తుంది.
- ఒక్కసారి రాస్తే చాలు. గజ్జి, తామర, దురద ఒక నిమిషంలో మాయం
- కఫము, పిల్లికూతలకు రామబాణం లాంటి ఔషధం
విటమిన్ ‘సి’ తో నిండి ఉన్న నిమ్మజాతి పండ్ల గొప్పదనం ఏంటో ఈ పాటికే మనకు అర్ధమయ్యింది.. ఇప్పుడు మరికొన్ని ప్రధాన ఉపయోగాలు తెలుసుకుందాం.
- ‘కొలాజెన్’ వంటి ప్రోటీన్ ఉత్పత్తికి విటమిన్ ‘సి’ తోడ్పడుతుంది. శరీరంలోని కణాలు ఒకదాన్ని మరొకటి అంటుకునేందుకు వీలుగా ఈ ప్రోటీన్ పనిచేస్తుంది.
- చర్మం నిగారింపుతో ఉండటానికి నిమ్మజాతి పండుని తినాలి.
- శరీరం ఐరన్ ని గ్రహించాలంటే, విటమిన్ ‘సి’ సహాయం కావలి.
- కణం రిపేర్ లో ఈ పండు పాత్ర ప్రధానంగా ఉంటుంది.
- చిగుళ్ళ సమస్యకు ఇది అవసరమే.
- శరీరంలోని అడ్రినల్, థైరాయిడ్ గ్రంధుల పని తీరులో ఈ విటమిన్ ఎంతో తోడ్పడుతుంది.
- వాతావరణం ద్వారా,లేక తినే ఆహరం ద్వారా శరీరంలోకి చేరే విషపదార్ధాలను తొలిగిస్తుంది.