‘బరువు’ సమస్య- నివారణ

కొవ్వుపదార్ధమే బరువును పెంచుతుంది.

ఈ కొవ్వునే ఫాట్స్ అని కూడా అంటాము.. కొవ్వు అధికమైతే, రక్త నాళాలలో చేరి అనేక సమస్యలని తెచ్చిపెడుతుంది.ముఖ్యంగా కడుపులో, ఎముకలలో వచ్చి కూర్చుంటుంది. ఇక్కడే మనం ప్రమాదంలో పడుతున్నామని గ్రహించాలి. మోకాళ్ళ నొప్పులతో మొదలై.. గుండె నొప్పితో మీ జీవితాన్నిఅర్దాంతరంగా ముగించే స్థితికి చేరుతున్నారు.

కేవలం మన ప్రవర్తన వల్లే మనం బరువు పెరుగుతాము.

తినే ఆహార శైలి, పడే శారీరికి శ్రమ సమంగా లేకపోయినా.. నిద్ర సరిగ్గా లేకపోయినా..  ఎక్కువ ఒత్తిడిలో ఉన్నా బరువు పెరుగుతారు. ఇది కాకుండా. హెరిడిటరీ గా కూడా,ఇంట్లో వంస పారంపర్యంగా కూడా బరువు పెరగడం జరుగుతుంటుంది.

ఈ అధిక బరువు వల్ల కొలెస్టరాల్, హై బి.పి, గుండెజబ్బులు, పక్ష వాతం, గాల్ బ్లాడర్ సమస్య, శ్వాస సంభందిత వ్యాధులు,డయాబిటీస్, రుతుశ్రావ సమస్యలు, నపుంసకత్వం, పిల్లలు కలగకపోడం,ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఇబ్బందులకు బరువే మూల కారణం అని చెప్పాలి.అయితే.. బరువు తగ్గించుకోడం అంత సులువేమీ కాదు..

పైపైన చేసే ప్రక్రియలకు తాత్కాలికంగా ఫలితాలు వచ్చినా, వ్యాయామం తప్పక చేయాలి. మీ పనులు మీరే చేసుకోవాలి.. ఆహార నియమాలు, సరైన సమయంలో తినడం లాంటివి పాటించాలి.కనీసం ఎనిమిది గంటల నిద్రపోవాలి. ఆహారం ఎలా తింటే బరువు పెరగారో.. అలా తెల్సి తింటే మరీ మంచిది. ఆహారంలో పీచు పదార్ధాలు తీసుకోవాలి.నూనె పదార్ధాలు మానేయాలి. తీపి, పులుపు, ఉప్పుని చాలావరకు తగ్గిస్తేనే మేలు. ఇలా చిన్న చిన్నగా మొదలు పెట్టి .. వైద్యుడిని కూడా సంప్రదించి మంచి జీవన శైలిని అనుసరిస్తూ..బరువు తగ్గుతూ ఆరోగ్యంగా బ్రతకండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top