ఎంత పలుచని జుట్టు అయినా సరే రాలకుండా ఒత్తుగా,ఊహించలేనంత పొడవుగా పెరుగుతుంది…

ఈ రోజుల్లో వెంట్రుకలు రాలడం లేదా వెంట్రుకలు సన్నబడడం చిన్న వయసులోనే సర్వసాధారణమైపోయింది. శరీరంలో న్యూట్రిషియన్స్ తగ్గడం జుట్టు సంరక్షణలో అజాగ్రత్త కారణంగా జుట్టు చాలా తొందరగా పాడైపోవడం జరుగుతోంది. అలాగే ఈ సమస్య కొందరిలో జెనటిక్ గా లేదా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదేవిధంగా ఎవరైతే ప్రతిరోజూ టాబ్లెట్ వేసుకుంటారు అలాంటి వారి జుట్టు కూడా కొద్దికొద్దిగా కొంతకాలానికి సన్న పడిపోవడం జరుగుతుంది. వెంట్రుకలు రాలడం లేదా వెంట్రుకలు సన్నబడడం డాండ్రఫ్ లాంటి సమస్యలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటాం. అలాగే మహిళలతో పాటు మగవారిలో కూడా ఈ ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది.

కొంతమందికి వెంట్రుకలు చాలా పొడవుగా మంచిగా ఉంటాయి కానీ వెంట్రుకలు చూడటానికి మాత్రం చాలా సన్నగా ఉంటాయి.  దీని వల్ల చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుందేమోనని భయపడిపోతుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంట్రుకల చికిత్స కోసం కచ్చితంగా ఆయిల్స్ వాడమని చెప్తారు. ఎందుకంటే వెంట్రుకల  పోషణ కోసం ఆయిల్ కచ్చితంగా వాడాలి. మార్కెట్లు ఎన్నో రకాల ఆయిల్స్ ఈ సమస్యను తగ్గించడానికి దొరుకుతాయి. కానీ ఈ ఆయిల్ అందరి వెంట్రుకలు కు సూట్ అవ్వదు. అలాగే కొన్ని వాయిస్ వెంట్రుకల సమస్య తగ్గించకుండా జుట్టు రాలడం పెంచుతాయి. దీనికి కారణం బయట దొరికే ఆయిల్స్ లో సువాసన కోసం మరియు ఎక్కువరోజులు నిలవ ఉండటానికి అందులో రకరకాల కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటారు.

అందుకే ఇలాంటి వెంట్రుకల సమస్యల కొరకు ఇంట్లోనే తయారు చేసుకునే ఆయుర్వేద చిట్కాలు వాడటం చాలా మంచిది. ఈ చిట్కాలు పాటించడం వలన ఇలాంటి వెంట్రుకల సమస్యల పూర్తి శాతం నయం చేసుకోవచ్చు. ఈరోజు మనం వెంట్రుకలు రాలడం వెంట్రుకలు సన్నబడటం అలాగే ఎటువంటి సమస్యలనైనా సులభంగా తగ్గించడానికి అద్భుతమైన ఆయుర్వేద తైలం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఈ రెండే కి కావలసిన ముఖ్యమైన పదార్థాలు.

  • కరివేపాకు
  • గులాబీ పూలు
  • మెంతులు
  • కర్పూరం
  • ఉసిరికాయ
  • ఉల్లిపాయ
  • మందార పూలు

ఎలాంటి ఆయిల్ తయారు చేసుకోవడానికి అయినా బేస్ ఆయిల్ కచ్చితంగా వాడాలి. అందులోకి మనం అన్ని పదార్థాలు కలుపుకొని తాయారు చేసుకోవాలి. ఈ ఆయిల్ ని తయారు చేసుకోవడానికి మనము కొబ్బరి నూనె మరియు నువ్వుల నూనె వాడాలి. నువ్వుల నూనె వాడడం వలన వెంట్రుకలు ఉన్న డాండ్రఫ్ వెంట్రుకలు రాలడం చాలా తొందరగా తగ్గిపోతుంది. ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే ఇందులో ఆవనూనె అంటే మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు.

ఈ ఆయిల్ తయారీ విధానం.

  • ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 50ml కొబ్బరినూనె 20 ml నువ్వుల నూనె పోసి ఈ ఆయిల్ లో మిగతా అన్ని పదార్థాలు వేసుకునేది గ్యాస్ పైన ఉడికించుకోవాలి.
  • ముందుగా ఈ ఆయిల్ లో అర కప్పు కరివేపాకు పది నుండి పదిహేను ఆకులు వేసి ఇ అందులో రెండు చెంచాల మెంతులు వేసి ఆ తర్వాత అందులో ఒక పూర్తి గులాబీ పువ్వు రేకులు వేసి ఆ తర్వాత అందులో మూడు లేదా నాలుగు మందార పూలు వేయాలి. మందార పువ్వు వేసేటప్పుడు మందార పువ్వు కాడలు మాత్రం వేయకండి.
  • తర్వాత ఇందులో అర్థము ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఇందులో ఒక ఉసిరికాయను రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి మీ దగ్గర కనుక తాజా ఉసిరికాయ లేకపోతే ఇందులో మీరు ఒక చెంచా ఉసిరికాయ పొడి వేసుకోవచ్చు. గ్యాస్ బ్లూ ఫిలిమ్ లో ఉంచుకొని దాదాపుగా 30 నిమిషాల పాటు మరిగించాలి.
  • 30 నిమిషాల తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఐదు గ్రాములు అంటే నాలుగు లేదా ఐదు కర్పూరపు బిల్లలు పౌడర్ గా చేసి ఈ ఆయిల్ లో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయన్ని బాగా ఆరనివ్వాలి. ఆయిల్ చల్లారిన తర్వాత వడగట్టుకుని ఒక గాజు సీసా లేదా ఒక కప్పులో పోసుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ కట్ చేసుకొని అందులో ఉండే ఆయిల్ ని కలుపుకోవాలి.

విటమిన్ ఇ మన హెయిర్ గ్రోత్ కు చాలా మంచిగా సహాయపడుతుంది మరియు దీనిని కలపడం ఈ ఆయిల్ వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ఈ ఆయిల్ ఎలా వాడాలి

ఈ ఆయిల్ ని వారానికి రెండు నుంచి మూడు సార్లు  నిద్ర పోయే ముందు హెయిర్ కు అప్లై చేసి చేతి వేళ్ళతో ఐదు నుండి పది నిమిషాలు మసాజ్ చేసి ఉదయాన్నే హెయిర్ ను వాష్ చేసుకోండి. మసాజ్ చేసుకొనేటప్పుడు బలంగా కాకుండా మృదువుగా నుదుటి దగ్గర చేతి వేళ్ళతో చిన్నగా మసాజ్ చేసుకోండి.

ఈ ఆయిల్ లో మందార పూలు వాడడం వలన మందార రేకుల్లో లో విటమిన్ సి మరియు ఎమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి వీటి వలన మన జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. వీటితో పాటు వెంట్రుకలు రాలడం ఆగిపోయి కొత్త వెంట్రుకలు రావడం మొదలు పెడతాయి. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి అన్ని పదార్థాలు మీకు దొరకకపోతే మీకు దొరకని పదార్థాలు వదిలేసి కూడా ఈ ఆయిల్ ని తయారు చేసుకోవచ్చు. అన్ని పదార్థాలు వాడితే మీకు ఫలితాలు చాలా తొందరగా వస్తాయి. రెండు నుంచి మూడు వారాల్లో ఈ ఆయిల్ యొక్క ఫలితాలు చూడడం మీరే చూస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top