స్త్రీలు తమ ముఖానికి ఇచ్చేంత సమయం… తమ కేశాలకు కూడా ఇస్తారు. వారి అందాన్ని రెట్టింపు చేసేందుకు అందమైన, పోడువైనా, గ్లో అవుతున్న కేసాలకోసమే ప్రతి మహిళ తాపత్రయ పడుతుంది. నగరంలోని కలుషితం.. తినే ఆహార శైలిలో లోపాల వలన కేశ సంరక్షణ లోపిస్తుందనే చెప్పాలి. కేవలం స్త్రీలనే కాదు పురుషులు కూడా అనేక ఇబ్బందులతో బాధపడుతుంటారు. చిన్న వయసులోనే జుట్టు రాలిపోడం,తెల్లపడటం, ముఖ్యంగా చుండ్రుతో సతమతమవుతుంటారు. అయితే ఈ బాధలన్నిటికీ చెక్ పెట్టేస్తూ మంచి ఉపాయాలతో మీ ముందుకొచ్చాము.
ముందుగా, అసలు చుండ్రు రావడానికి కారణం ఏంటో తెలుసుకోండి… కాలుష్యం పెద్దపీట వేసుకొని కూర్చోడం వలన చుండ్రుతో బాధపడుతుంటారు. ఈ సమస్యను అరికట్టేందుకు చేసే ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.. వీటిలో.. ఫ్రూట్ తెరఫీ లేదా వెజిటెబుల్ తెరఫీని వాడితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఫ్రూట్ తెరఫీ లో… యాపిల్
రెండు యాపిల్ పండ్లను మాష్ చేసుకొని వెంట్రుకలకు సమానంగా పూసుకోవాలి. ఇలా చేసాక ఒక గంట సేపు ఉంచి.. ఆ తర్వాత చన్నీటితో తల స్నానం చేసుకోవాలి. కనీసం వారంలో రెండు సార్లు ఇలా చేస్తే..చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వారానికి రెండు సార్లు రాస్తే చాలు. జుట్టు రాలడం తగ్గి మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా బలంగా పెరుగుతుంది
- కేవలం అయిదు నిమిషాల్లో మీ ముఖం పై ఉన్న నల్లదనం మొత్తం పోయి తెల్లగా మెరిసిపోతారు.
- ముఖంపై మొటిమలు పోగొట్టడానికి ఈ కాంబినేషన్ బెస్ట్
వెజిటెబుల్ తెరఫీలో… టమాటో
ముందుగా రెండు లేక మూడు టమాటో లను తీసుకొని, మాష్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి. దీంట్లో కొన్ని చుక్కలు నిమ్మరసం కలపాలి. ఈ రెండిటిని బాగా కలిపాక, ఈ పేస్టు ని తలకి, జుట్టుకి బాగా పట్టించాలి. ఒక నలభై నుంచి అరవై నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో తల స్నానం చేసుకోండి..