అన్నీ వయసుల వారు ఒకే రకమైన ఫేస్ ప్యాక్స్ వాడకోడదు.. ఏ వయసులో ఉంటె.. దానికి తగిన విధానాన్ని అనుసరించాలి. ఒక్కో వయసులో వారు వారి వయసుకి తగిన విధంగా ప్యాక్స్ ని తయారు చేసుకొని వాడితే మంచి ఫలితాలు వస్తాయి..అలానే అందంగా, ఆకర్షణగా ఉంటారు.
15 నుండి 20 సంవత్సరాలు అమ్మాయిల కోసం…
- ఈ వయసులో ఉన్న అమ్మాయిలు కనీసం మూడు సార్లు వేడినీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
- టోనర్ ని తప్పక వాడాలి. రైస్ వాటర్ మంచి టోనర్.. అలానే దోసకాయ గుజ్జు.
- జ్యూస్లలో ద్రాక్ష పండు.. ఆపిల్ పండు, నారింజ పండు, నిమ్మరసం లాంటివి తరచూ తాగాలి. ఇవి కడుపుని క్లీన్ చేసి మొటిమలను మాయం చేస్తాయి.
- కోడిగుడ్డు తెల్లసొనలో మూడు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఒక 20 నిమిషాల ఆగి వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. ముఖం కాంతివంతంగా.. మచ్చలు, మొటిమలు లేకుండా ఉంటుంది.
20 నుండి 40 సంవత్సరాల మహిళల కోసం…
- ఈ వయసులో మొటిమలు, కళ్ళక్రింద నల్లని మచ్చలు, ముడతలు అధికంగా కనిపిస్తుంటాయి. ఒక మూడు చెంచాల టమాటో రసంలో తేనె కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాలు ఆరబెట్టాకా మసాజ్ చేసుకోవాలి.తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
- కళ్ళక్రింద నల్లమచ్చలు తొలిగిపోవాలంటే.. ముందు సరైన నిద్ర అవసరం. మూడు లీటర్ల నీళ్ళు తాగాలి.. అలానే.. ఒక ఆలుగడ్డను రౌండ్ గా కోసి కళ్ళ పైన ఉంచుకోవాలి. ఇలా వారం రోజులు చేయాలి.