నిద్ర మనకు ఎంతవరకు అవసరం? మంచి నిద్ర కావాలంటే?

మనిషికి ఆహరం నుంచి శక్తి వస్తుందన్న సంగతి తెలిసిందే.. కాని  శక్తి నిచ్చే సాధనే నిద్ర. శరీరానికి కావల్సినంత నిద్ర పోకపోతే ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతాయి. నిద్ర వెంటనే పట్టడం ఒక వరం. ఇది జరగని వారి జీవితం నరకప్రాయం అని చెప్పచ్చు. ప్రతిపనికి నిర్దేశించిన సమయం ఉంటుంది. అలానే నిద్రకు కూడా సమయం నిర్దేశించు కోవాలి. ఒకే సమయానికి పడుకోవాలి, అలానే లేచే వేల కూడా ఒకటిగా ఉండాలి. దీని వలన శరీరానికి ఎంతో విశ్రాంతి, ఆరోగ్యం లభిస్తుంది.

సుఖనిద్ర కోసం పాటించాల్సిన నియమాలు

  • రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు పాటు నిద్రపోవాలి.
  • అవసరానికి మించిన నిద్ర అనవసరం. టీ, కాఫీలు తగ్గించండి.
  • రాత్రి సరిగ్గా నిద్రపోవాలంటే, ఉదయం సమయాల్లో నిద్రకి దూరంగా ఉండాలి.
  • సాయంకాలం వ్యాయామాలు చేసినా, లేకా నడిచినా శరీరం అలిసిపోయి త్వరగా నిద్రపడుతుంది.
  • పడుకునే ముందు ప్రాణాయామం చేయడం వల్ల శరీరం తేలికై నిద్ర సులువుగా పడుతుంది.
  • మంచి మ్యూజిక్ పెట్టుకొని పడుకుంటే నిద్రలోకి సులువుగా జారుకుంటారు.
  • మానసిక వత్తిడులకు సాధ్యమైనంత దూరం ఉంటె మంచిది.. ఒకవేళ ఎటువంటి స్ట్రెస్ కి లోనవుతున్నా.. పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేసుకొని పడుకుంటే మంచిది.
  • గోరు వెచ్చని కొబ్బరి నూనెతో హెడ్ మసాజ్ చేసుకోడం వలన మంచి రక్త ప్రసరణ జరిగి నిద్ర బాగా పడుతుంది.
  • జీర్ణక్రియ సక్రమంగా జరగపోయినా నిద్ర ఉండదు. కాబట్టి రాత్రి పూట అల్పాహారం,పండ్లు  తింటే మంచిది. మసాలా,  ఆయిల్ ఫుడ్స్ ను దూరం పెడితే.. నిద్ర మీదరికి చేరుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top