ప్రస్తుత కాలంలో అందరూ జుట్టు రాలే సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు అటువంటి వారికి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించడం వలన మన జుట్టు సమస్యలు అన్ని అనగా జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, ఉడిన చోట కొత్త జుట్టు రాకపోవడం, చుండ్రు ఎక్కువ అవ్వడం వంటి సమస్యల నుంచి విడుదల అందించడంతోపాటు మన జుట్టును స్మూత్ అండ్ సిల్కీగా ఉంచుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు.
దీని కోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఉపయోగించే ఏదైనా కాఫీ పౌడర్ ను రెండు స్పూన్లు వేసుకోవాలి. కాఫీ పౌడర్ మన జుట్టుకు చాలా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. మరియు జుట్టుకు నేచురల్ డై లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మన జుట్టుకు సరిపడినంత వేపాకు పొడి లేదా వేపాకు పేస్ట్ ని వేసుకోవాలి. వేపాకు పొడి ప్రస్తుత కాలం మనకు ఆన్లైన్ లో ఈజీగా లభిస్తుంది. వేపాకు పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే వేపాకులు కు కొద్దిగా నీటిని కలిపి మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి.
ఈ మెంతుల కు కొద్దిగా నీటిని వేసుకుని 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా వచ్చిన కషాయం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మరసం చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం ద్వారా మన జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మరగబెట్టుకున్న కషాయం వేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మన రెమిడి తయారవుతుంది.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన జుట్టుకు పాయలు పాయలుగా తీసుకొని కుదుళ్ల నుంచి చిగుళ్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న 30 నిమిషాల తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ ఉపయోగించి తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మన జుట్టు లాంగ్ మరియు స్మూత్ అండ్ సిల్కీ గా తయారవుతుంది.