జుట్టు పొడవు తక్కువ గా ఉంది అని, జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంది అని బాధపడే వారికి ఈ రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చుండ్రు తో బాధపడే వారికి కూడా ఈ రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉపయోగించేవి అన్ని నేచురల్ గా మన ఇంట్లో లభించేవి కనుక వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు.
ఈ రెమిడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం రెండు స్పూన్ల మెంతులు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో ఒక గ్లాసు నీటిని వేసుకొని 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. మెంతులు మన జుట్టుకి ఒక సంజీవని అని చెప్పవచ్చు. మెంతులను ఉపయోగించడం వలన మన జుట్టు ఎదగడమే కాకుండా చుండ్రు నుంచి విడుదల పొందవచ్చు. అంతేకాకుండా మన జుట్టు స్మూత్ అండ్ సిల్కీ గా ఉంటుంది. తర్వాత ఒకటిన్నర స్పూన్ రోజ్ మెరీ ఆకులను వేసి బాగా మరగనివ్వాలి. ఇవి మనకి ఆన్లైన్లో అవైలబుల్ గా ఉంటాయి.
ఇవి మన జుట్టు ఎదుగుదలలో బాగా సహకరిస్తాయి. నీటిని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆముదం నూనెను వేసుకోవాలి. ఈ నూనె మన జుట్టుకు మంచి హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది. తర్వాత ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. ఇది మన జుట్టును స్మూత్ అండ్ సిల్కీగా ఉంచుతుంది. ఈ రెండిటిని బాగా కలిపితే ఒక వైట్ క్రీమ్ లాగా తయారవుతుంది. తర్వాత మనం చల్లార్చిన మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.
ఈ పేస్ట్ ను ఏదైనా వడకట్టు సహాయంతో వాడుకట్టుకోవాలి. ఇలా వడకట్టుగా వచ్చిన మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న ఆముదం మరియు అలోవెరా జెల్ క్రీమ్ లో కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మన జుట్టుకు పాయలు పాయలుగా తీసుకొని కుదుళ్ళ నుంచి చిగుళ్ల వరకు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక గంట సేపు డ్రై అవ్వనిచ్చి తరువాత ఏదైనా మైల్డ్ షాంపుతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.