దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు

ప్రతి ఒక్కరూ ముఖం అందంగా,  కాంతివంతంగా కనిపించడం కోసం పార్లర్ కి వెళ్లి వేలకు వెళ్లి ఖర్చుపెట్టి ఫేసియల్స్  చేయించుకుంటారు. కొంతమంది ఇంట్లోనే రకరకాల ప్రొడక్ట్స్ ని ఉపయోగించి ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించడం కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ వాటిలో అనేక రకాల  కెమికల్స్ ఉంటాయి. ఇవి అనేక  రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా  నాచురల్ గా ఇంట్లో ఉండే వాటితోనే మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

దీనికోసం ముందుగా మూడు చెంచాలు పెరుగు తీసుకొని ఒక పలుచటి  కాటన్ క్లాత్లో వేసుకొని నీరు మొత్తం తీసేసుకోవాలి. నీరు తీసేయగా మిగిలిన మెత్తటి పేస్ట్ లాంటి పదార్థాన్ని ఒక బౌల్ లో వేసుకుని  దానిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవా.లి విటమిన్ ఈ క్యాప్సిల్ లేకపోతే కొబ్బరి నూనె లేదా బాదం నూనె  వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక చెంచా  గ్లిజరిన్ కూడా వేసుకోవాలి. గ్లిజరిన్ స్కిన్ విటెనింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఈ మూడింటిని బాగా కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకొని ఒక పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక వారం రోజులపాటు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు  అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే డార్క్ సర్కిల్స్, మొటిమల వలన  వచ్చిన మచ్చలు,  పిగ్మెంటేషన్, ముడతలు వంటి అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.  ఈ క్రీమ్ ను ఒకేసారి తయారు చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకొని వారం రోజులు పాటు ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఈ క్రీమ్ ను ఉపయోగించడం వల్ల స్కిన్ వైట్ గా కూడా మారుతుంది. పెరుగులో ఉండే  లాక్టిక్ ఆసిడ్ ముఖంపై ఉండే అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ క్యాప్సిల్ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ పాచెస్, ఫైన్ లైన్స్ తగ్గించి చర్మాన్ని మోయిశ్చరైజ్  చేసి ముఖాన్ని అందముగా, కాంతివంతంగా మార్చుతుంది. ఈ క్రీం ఆడవారు మరియు మగవారు కూడా ఉపయోగించవచ్చు. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించలేదు. కాబట్టి దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top