కొంతమందిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాగా అలసిపోయినప్పుడు గురక సమస్య ఉంటుంది. కొంతమంది లో ఈ సమస్య బాగా తీవ్రంగా ఉంటుంది. కొంతమందిలో ఊపిరితిత్తుల్లో, శ్వాసనాళాల్లో సమస్య ఉన్నప్పుడు కూడా గురక సమస్య వస్తుంది. దీనివలన గురక పెట్టే వ్యక్తికి ఇబ్బంది లేకపోయినా పక్కనున్న వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనికి అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే సరైన ఫలితం లేక ఈ సమస్యతో బాధపడుతున్నారు.
దీనికి ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఆయుర్వేద చిట్కాలుతో తగ్గించుకోవచ్చు. దానికోసం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటి పై పొట్టు తీసి మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లిలో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంలో శ్వాస సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.బరువు తగ్గిస్తుంది.
తర్వాత పదార్థం వాము. వాము గ్యాస్ , ఎసిడిటీని తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను కూడా వాము తగ్గిస్తుంది. వాము ఛాతిలో చేరిన కఫం తగ్గించి శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తుంది. వాము ఒక స్పూన్ మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల వేడి నీటిని తీసుకొని అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక స్పూన్, వాము పొడి ఒక స్పూన్ వేసుకోవాలి.
వీటన్నింటిని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక గ్లాసులో ఒక నిమ్మకాయను పిండి ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి నీటిని ఇందులో కలుపుకోవాలి. వేడి నీటిలో తేనెను నేరుగా కలపకూడదు. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి మరికొన్ని నీటిని చేర్చి రోజులో ఏదొక పూట తీసుకోవాలి.
అంటే ఉదయం లేచిన వెంటనే లేదా టిఫిన్ చేసిన తరువాత లేదా భోజనం చేసిన తరువాత లేదా పడుకునే ముందు ఏదో ఒక సమయంలో ఒక గ్లాస్ తాగాలి. అలాగే సూర్యముద్ర అంటే రెండు ఉంగరపువేళ్ళు బొటన వేలు క్రింద మడిచి కళ్ళు మూసుకుని ఓం శాంతి… శాంతి… హి అని ఉచ్చరిస్తూ కనీసం నలభై నిమిషాల పాటు ఉండడం వలన బరువు తగ్గడం, గురక, శరీరంలో అలర్జీలు, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.