వేసవిలో తమలపాకు జ్యుస్ తాగితే ఆశ్చర్యపరిచే ఫలితాలు!!

అన్ని ఆకులలోకి విశిష్టమైనది, పవిత్రమైనది తమలపాకు. ఈ విషయం మనకు తెలిసినదే. తమలపాకును కేవలం దేవుడి కోసం, శుభకార్యాలలో, గాంబూలం వేసుకోవడానికి ఇలా ఉపయోగిస్తారని కూడా తెలుసు. అయితే తమలపాకును జ్యుస్ చేసుకుని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండోయ్. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో తమలపాకు జ్యుస్ అదుర్స్. తమలపాకులలో చావికోల్, బెట్టెల్ ఫినాల్, యూజీనాల్, టెర్పెన్ మరియు కాంపీన్ ఉంటాయి.  ఈ రసాయన భాగాలు గొప్ప ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. అనేక వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. తమలపాకు జ్యుస్ ప్రయోజనాలు చదివేయండి మరి.

  యాంటీ డయాబెటిక్ ఏజెంట్

సాదారణంగా  యాంటీ-డయాబెటిక్ మందులు దీర్ఘకాలం వాడటం వల్ల కాలేయం మరియు మూత్రపిండాలపై దుష్ప్రభావాలను చూపిస్తాయి. అయితే సహజంగా తమలపాకు జ్యుస్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి.  టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్నవారిలో ఎండిన తమలపాకు పొడి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎలాంటి దుష్ప్రవాలను కలిగించదు.

 అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

అధిక కొలెస్ట్రాల్  గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌లకు ప్రమాద కారకం అవుతుంది.  మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించడంలో తమలపాకు జ్యుస్ సహాయపడుతుంది.  ఇంకా, ఇది అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడుతుంది.  ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించే యుజినాల్ కూడా తమలపాకు వల్ల లభిస్తుంది.  యూజీనాల్ కాలేయంలో కొలెస్ట్రాల్ యొక్క జీవసంశ్లేషణను నిరోధిస్తుంది మరియు పేగులో లిపిడ్ శోషణను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

 క్యాన్సర్ ను నిరోధిస్తుంది

చాలామంది తమలపాకుల్లో పొగాకును జతచేసుకుని తింటుంటారు. అలాగే వక్క కూడా జతచేరుస్తూ ఉంటారు. వక్కపొడితో కలిపి ఈ పొగాకు సేవించడం వల్ల అది నోటి క్యాన్సర్ కు దారితీస్తుంది.  తమలపాకుల్లో ఫినోలిక్ సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మ్యుటాజెనిక్, యాంటీ ప్రోలిపేరిటీవ్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. వివిధ రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా తమలపాకు జ్యుస్ పనిచేస్తుంది. కాన్సర్ కణాల పెరుగుదలని సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

యాంటీ మైక్రోబయల్ ఏజెంట్

తమలపాకులలో ఉండే ముఖ్యమైన నూనె, వ్యాధికారక బాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటీ బాక్టీరియల్ చర్యను కలిగి ఉంటుంది.  ఇంకా ఈ ఆకుల జ్యుస్ సేవించడం వల్ల ఇందులోని ఫినోలిక్స్ మరియు ఫైటోకెమికల్స్ ఉండటం రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది

గాయం నయం చేసే ప్రక్రియలో తమలపాకులు సమర్థవంతంగా సహాయపడతాయి. కాలిన గాయాలు, కందిపోయిన ప్రాంతంలో తమలపాకులను నేరుగా గాయం మీద పెట్టడం, తగినంత తమలపాకు జ్యుస్ తీసుకోవడం వల్ల చాలా తొందరగా ఉపశమనం ఉంటుంది. గాయాలు మానడానికి అవసరమైన ప్రోటీన్ స్థాయిని సమృద్ధిగా గ్రహించడంలో తమలపాకు జ్యుస్ దోహదం చేస్తుంది. దీని ద్వారా గాయాలు తొందరగా మానతాయి.

అస్తమాను తగ్గిస్తుంది

ఉబ్బసం చెప్పడానికి పెద్ద సమస్య కాకపోయినా అది అనుభవించేవారికి నరకం చూపిస్తుంది.  తమలపాకుల్లో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉబ్బసం చికిత్స మరియు శ్వాస సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. హిస్టామైన్ అనేది ఉబ్బసం కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మృదువైన కండరాలను బిగించడం వల్ల ఊపిరితిత్తులలోని వాయుమార్గాలు సంకోచించబడతాయి.  దీనివల్ల ఉబ్బసం వస్తుంది. తమలపాకు జ్యుస్ తీసుకోవడం వల్ల ఈ ఉబ్బసం సమస్యను సులువుగా అధిగమించవచ్చు.

 గ్యాస్ సమస్యలను నివారిస్తుంది

గ్యాస్ట్రిక్ అల్సర్ చికిత్సకు ఉపయోగించే పురాతన సాంప్రదాయ చికిత్సలో తమలపాకు తాంబూలం తీసుకోవడం కూడా ఒకటి. కడుపులో పుండుకు కారణమయ్యే బాక్టీరియా జీర్ణశయం లోపలి పొరను దెబ్బతీస్తాయి, గ్యాస్ట్రిక్ శ్లేష్మం ఉత్పత్తిని తగ్గిస్తాయి మరియు ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిని పెంచుతాయి.  తమలపాకుల జ్యుస్ ఈ పుండ్లను తగ్గించడంలో ద్బుతంగా పనిచేస్తుంది. అలాగే కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల కడుపులో మంట, అల్సర్ ద్వారా ఎదురయ్యే కడుపునొప్పి తగ్గిస్తుంది.

చివరగా…..

తమలపాకులు మనకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి వేసవిలో ఈ వెరైటీ జ్యుస్ ద్వారా  ఆరోగ్య సమస్యలను కూడా దూరం పెట్టేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top